భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి. ఈ మధ్య కొన్ని సినిమాల్లో ఆ కథలను అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశారు. మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఇప్పుడు అలాంటి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు.కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం’ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్ కానుంది.
జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి మమ్ముట్టి మాట్లాడుతూ- “భారతదేశ సంస్కృతి విశిష్టమైనది. భాషలు మనల్ని విభజిస్తాయి. కానీ భాష వల్ల మన చరిత్ర వేరే వాళ్లకి తెలియకుండా పోకూడదు. కేరళ రాష్ట్ర చరిత్ర అంటే భారత దేశ చరిత్ర కూడా. సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా అన్నీ భాషల ప్రేక్షకులను ఏకం చేసి, మనకి సంబందించిన ఒక మంచి కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. `మామాంగం’ కథ అందరికీ తెలియాలి” అన్నారు
డైరెక్టర్ ఎం. పద్మకుమార్ మాట్లాడుతూ – “1695వ సంవత్సరంలో జరిగిన ఒక నిజమైన కథతో, ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి విజువల్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. జమోరిన్‌ని చంపిన చావేర్స్ కథే ఈ సినిమా. మమ్ముట్టి ఈ సినిమాలో ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో కనిపిస్తారు. ఒక 12 ఏళ్ల అబ్బాయి.. చరిత్రలోని ఒక పాత్రను పోషిస్తూ ఇండియన్ స్క్రీన్ లో ఎప్పుడూ చూడనటువంటి యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు” అన్నారు.
నిర్మాత వేణు కున్నపిళ్లి మాట్లాడుతూ – “ఈరోజు విడుదల చేసిన సినిమా టీజర్ కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. మా సినిమా మేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాం. మమ్ముట్టి గారికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. స్వాతి కిరణం, యాత్ర లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు.`మామాంగం` చిత్రాన్ని నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం ” అని తెలిపారు.
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!