Manamey First Review: ‘మనమే’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?
June 5, 2024 / 05:43 PM IST
|Follow Us
శర్వానంద్ (Sharwanand) 35వ చిత్రంగా రూపొందిన ‘మనమే’ (Manamey).. జూన్ 7న రిలీజ్ కాబోతోంది. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం విశేషం. ఇదిలా ఉండగా.. ‘మనమే’ చిత్రం పై హీరో శర్వానంద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకి ‘మనమే’ చిత్రాన్ని చూపించాడట శర్వానంద్. ఆ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి :
ముందుగా సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాలు అట. ఫస్ట్ హాఫ్ చాలా ప్లెజెంట్ గా ఉంటుందట. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచానికి తీసుకువెళ్తాడని… కామెడీ, ఎమోషన్స్ .. వినూత్నంగా అనిపిస్తాయని తెలుస్తుంది. ఎక్కడా కూడా ప్రేక్షకులకి బోర్ అనే ఫీలింగ్ కలగకుండా శ్రీరామ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో శర్వానంద్ చాలా స్టైలిష్ గా కనిపించాడట.
అతని కామెడీ టైమింగ్,ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ .. మనకి 10 ఏళ్ళ క్రితం వచ్చిన ‘రన్ రాజా రన్’ రోజులని గుర్తుచేస్తాయని చెబుతున్నారు. ఇంకో రకంగా ఇది శర్వానంద్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అనుకోవచ్చని కూడా అంటున్నారు. అలాగే ‘బేబమ్మ’ తర్వాత హీరోయిన్ కృతి శెట్టికి (Krithi Shetty) ఆ రేంజ్ రోల్ పడలేదు. కానీ ‘మనమే’ తో ఆ లోటు తీరిపోతుందని… ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డిజైన్ చేసారని… లుక్స్ పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా కూడా ఆమె సర్ప్రైజ్ చేయబోతోందని స్పష్టమవుతుంది.
అలాగే ఈ సినిమాలో కనిపించిన చంటిపిల్లాడి పాత్ర కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందట. ఈ బాబు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొడుకు అనే సంగతి తెలిసిందే. ఇక వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ కూడా హిలేరియస్ గా సాగుతుందట. చివరి 40 నిమిషాలు అయితే హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మరోవైపు టెక్నికల్ గా కూడా ‘మనమే’ సినిమా చాలా రిచ్ గా ఉంటుందట. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం, అద్భుతమైన విజువల్స్ .. ప్రేక్షకులకి ఐ ఫీస్టులా అనిపిస్తాయట.
మ్యూజిక్ కూడా టాప్ నాచ్ లో ఉంటుందని..ఇందులో 16 పాటలు ఉంటాయి.. ప్రతి పాట కథని అందంగా వివరిస్తుందని అంటున్నారు.ఇక నిర్మాతలైన ‘పీపుల్ మీడియా’ వారు ఖర్చుకి వెనకాడకుండా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్టు ప్రతి ఫ్రేమ్ చెబుతుందని సినిమా చూసిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా ‘మనమే’ తో శర్వానంద్ ఓ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది.