Pawan Kalyan: పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నటి!

  • June 12, 2021 / 05:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో సక్సెస్ అందుకున్న పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, అలానే సాగర్ చంద్ర రూపొందిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు. ఈ రెండు సినిమాల తరువాత హరీష్ శంకర్ దర్శకతంలో సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవేవీ నమ్మొద్దని చిత్రబృందం ప్రేక్షకులను కోరింది. నటి మానస కూడా తనపై వస్తోన్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. తాను పవన్ కళ్యాణ్ 28వ సినిమా లేనని స్పష్టం చేసింది.

కానీ పవన్ సార్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దీంతో ఈమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం మానస తమిళంలో ఓ సినిమా చేస్తుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus