సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ జంటగా ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు మారుతి తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘మంచిరోజులు వచ్చాయి’ థియేట్రికల్ రన్ ముగిసింది. ‘యువీ కాన్సెప్ట్స్’, ‘మాస్ మూవీ మేకర్స్’ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది.పైగా పోటీగా రెండు సినిమాలు ఉండడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పెద్దగా నమోదు కాలేదు .
ఓసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 1.09 cr |
సీడెడ్ | 0.51 cr |
ఉత్తరాంధ్ర | 0.35 cr |
ఈస్ట్ | 0.31 cr |
వెస్ట్ | 0.23 cr |
గుంటూరు | 0.29 cr |
కృష్ణా | 0.25 cr |
నెల్లూరు | 0.21 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.24 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.13 Cr |
ఓవర్సీస్ | 0.19 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.56 cr |
‘మంచిరోజులు వచ్చాయి’ చిత్రానికి రూ.8.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.3.56 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.5 కోట్ల పైనే నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!