అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సంచలన కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి!

  • August 4, 2018 / 07:18 AM IST

గత ఏడాది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన సినిమా అర్జున్ రెడ్డి. యువ హీరో విజయ్ దేవరకొండ నటన, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ ప్రతిభ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టాయి. 4 కోట్లతో తెరకెక్కి న ఈ చిత్రం 50 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. అలాగే ఈ ఏడాది యువ హీరో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లు హీరో హీరోయిన్లుగా నటించిన “ఆర్‌ఎక్స్ 100” టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా యువతని విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ 2 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 20 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. ఈ రెండు సినిమాలపై కొంత నెగటివ్ టాక్ ఉంది.

బోల్డ్ సినిమా అని విమర్శించేవారు లేకపోలేదు. మరి ఈ రెండు సినిమాలపై నిర్మాత, నటి అయిన మంచు లక్ష్మి అభిప్రాయాన్ని కోరగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “అర్జున్ రెడ్డి సినిమా మంచి సినిమా. నేను కట్స్ లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసాను. సెక్సువాలిటీ ఉంది. కానీ వల్గారిటీ లేదు. అదొక ఎమోషన్. ఇక ఆర్ఎక్స్ 100 మూవీని నేను చూడలేదు. అయితే అందులో వల్గారిటీ ఎక్కువగా ఉందని విన్నాను. నాకు అది నచ్చదు. అటువంటి సినిమాలు చేయను” అని స్పష్టం చేశారు. పెళ్లి చూపులు, క్షణం, మహానటి.. వంటి విలక్షణమైన సినిమాలు చేయడానికి తాను ఇష్టపడుతానని, లాభాలు రాకపోయినా  ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాలను చేయనని వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus