చరణ్ గ్రామాన్ని దత్తత తీసుకోవడంపై స్పందించిన మంచు మనోజ్
October 23, 2018 / 06:38 AM IST
|Follow Us
తెలుగు పరిశ్రమలో హీరోల మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో మరోసారి స్పష్టమైంది. చరణ్ చేసిన మంచి పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మంచు మనోజ్ కూడా చరణ్ ని ట్విట్టర్ వేదికపై ప్రసంశించారు. ఈమధ్య తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లలో పలుగ్రామాలను కుదిపేసింది. అక్కడ గ్రామాలను పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఈ గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనీ తన అన్న కొడుకు చరణ్ కి కోరారు. అందుకు సంతోషంతో చరణ్ ముందుకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. దీనిపై మంచు మనోజ్ స్పందించారు.
‘‘అంతా మన నుంచే మొదలవ్వాలి.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్నా. గొప్ప కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి పనిని చేపట్టేందుకు రామ్ చరణ్‌కు స్ఫూర్తి కలిగించిన పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం చాలా మంచి పని’’ అంటూ ట్వీట్ చేశారు. ఇదివరకు మహేష్ బాబు కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు చరణ్ ఆ జాబితాలో చేరారు. ఇలా స్టార్ హీరోలు గ్రామాలని అభివృద్ధి చేయడానికి ముందుకురావడం సంతోకరమైన విషయం. చరణ్ ని చూసి మరికింతమంది గ్రామాలను దత్తత తీసుకుంటారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.