తన భార్యతో విడాకులు తీసుకున్నట్టు.. కన్ఫర్మ్ చేసిన మనోజ్!
October 17, 2019 / 07:57 PM IST
|Follow Us
మోహన్ బాబు చిన్నకొడుకు మరియు ప్రముఖ హీరో అయిన మంచు మనోజ్ తన భార్య ప్రణతితో విడిపోయారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ లేదు. ‘ఇద్దరి మధ్య మనస్పర్ధలుతలెత్తడంతోనే విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇక మనోజ్ భార్య ప్రణతి కూడా చాలా కాలంగా అమెరికాలోనే ఉండడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. అయితే మధ్యలో ఒకసారి మంచు మనోజ్ తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి.. ‘మేము సంతోషంగానే ఉన్నాము.. అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేయొద్దు అంటూ ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు.
అయినా ఆ వార్తలు ఆగలేదు. ఇక ఇప్పుడు ఆ విషయం పై ఫుల్ క్లారిటీ ఇస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు మనోజ్. తన ట్విట్టర్ ద్వారా మనోజ్ స్పందిస్తూ.. “ఈరోజు మీకో ముఖ్యమైన విషయం చెబుతాను. నా పెళ్ళి డివోర్స్ తో ముగుస్తుందని అస్సలు అనుకోలేదు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉంది.. కానీ కలిసి జీవించలేము. నా మనసు సరిగ్గా లేకపోవడం వలనే ఇంతకాలం పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. ఈ బాధలో నా కుటుంబం వెన్నంటే ఉంది. ఇక పై నా బాధను పక్కన పెట్టి సినిమాల పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రణతిని చాలా కాలం పాటు ప్రేమించి 2015లో పెళ్ళి చేసుకున్నాడు మనోజ్. పెళ్ళి చేసుకున్న కొన్నాళ్ళ నుండే వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ఫైనల్ గా విడాకులతో తమ బంధానికి స్వస్తి చెప్పారని ఈ పోస్ట్ తో క్లారిటీ వచ్చింది.