Manchu Vishnu: మంచు విష్ణు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
August 27, 2021 / 12:39 PM IST
|Follow Us
24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఒకప్పుడు మంచు విష్ణు సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ పై ఎక్కువ సినిమాలు రాలేదు. 2015 సంవత్సరంలో ఈ బ్యానర్ లో మామ మంచు అల్లుడు కంచు సినిమాను విడుదల చేశారు. ఈ ఏడాది విష్ణు నిర్మాతగా మోసగాళ్లు అనే సినిమా విడుదలైంది. అయితే తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో విష్ణు మాట్లాడుతూ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో 14 సినిమాలను మొదలుపెట్టనున్నామని తెలిపారు.
ప్రస్తుతం ట్రెండ్ మారుతోందని గడిచిన 4 సంవత్సరాలుగా కథలపై పెట్టుబడులు పెట్టామని విష్ణు చెప్పుకొచ్చారు. ట్రెండ్ కు తగిన విధంగా కథ ఉంటే మాత్రమే సక్సెస్ సాధించే అవకాశం ఉంటుందని విష్ణు పేర్కొన్నారు. థియేటర్లలో సినిమాలు చూసేవాళ్లు సైతం ఓటీటీలలో సినిమాలు చూస్తారని విష్ణు కామెంట్లు చేశారు. శ్రీకాంత్ తో ఇప్పటికే ఒక సిరీస్ చేశామని ఆ సిరీస్ కు రెస్పాన్స్ బాగుందని విష్ణు అన్నారు. నవంబర్ లో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలో 14 సినిమాలు మొదలుపెట్టబోతున్నామని ఐదేళ్ల సంపాదనను తాను కథలపై పెట్టానని విష్ణు చెప్పుకొచ్చారు.
ఇప్పటికే నాన్న, నేను, మనోజ్ కలిసి పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించి సక్సెస్ సాధించామని కథ కుదిరితే అక్కతో కూడా కలిసి పని చేస్తామని విష్ణు వెల్లడించారు. నాన్న నటించిన సినిమాలలో ఎమ్.ధర్మరాజు ఎం.ఎ, అల్లుడుగారు సినిమాలను రీమేక్ చేయాలని ఉందని విష్ణు చెప్పుకొచ్చారు. 14 సినిమాలను మొదలుపెట్టాలనే మంచు విష్ణు ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.