Manchu Vishnu: టికెట్ రేట్ ఇష్యూపై ‘మా’ ప్రెసిడెంట్ రియాక్షన్!
February 8, 2022 / 02:42 PM IST
|Follow Us
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. అలానే సినిమా టికెట్ల విషయం, ఇతర సమస్యలపై సినీ పెద్దలతో కలిసి మాట్లాడనున్నారు చిరు. ఈ పరిస్థితుల మధ్య మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో మీడియా సమావేశంలో పాల్గొన్న మంచు విష్ణు..
ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి భేటీపై రియాక్ట్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రితో చిరంజీవి సమావేశం ఆయన వ్యక్తిగత విషయమని అన్నారు. అది అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదని తెలిపారు. టికెట్ రేట్లపై సినిమా పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి రావాలని.. రెండు ప్రభుత్వాలతో టికెట్ ధరల విషయంపై చర్చలు జరగాలని అన్నారు. ఈ వివాదంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని.. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు.
వ్యక్తిగతంలో ప్రభుత్వంతో మాట్లాడి దీనిపై వివాదం చేయడం కరెక్ట్ కాదని మంచు విష్ణు అనడం చర్చనీయాంశంగా మారింది. గతంలో వచ్చిన జీవోలు, తీసేసిన జీవోలపై ముందు మాట్లాడాలని.. ఆ తరువాత ప్రస్తుతం జీవోల గురించి మాట్లాడాలని అన్నారు. అలానే ‘మా’ అసోసియేషన్ వంద రోజుల ప్రగతి, మా అసోసియేషన్ తరఫున ‘మా’ భవనం గురించి త్వరలోనే మీడియాతో మాట్లాడతానని చెప్పారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఈ ఏడాదిలో ప్రారంభం కానుందని..
ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని ప్రకటించారు మంచు విష్ణు. సినిమాకి సంబంధించిన అన్ని రంగాలని ఇక్కడ శిక్షణ ఇస్తామని అన్నారు.