Prabhas Remuneration: ప్రభాస్ పారితోషికం పై క్లారిటీ ఇచ్చేసిన మంచు విష్ణు!
March 23, 2024 / 05:50 PM IST
|Follow Us
ప్రభాస్ (Prabhas)ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతని సినిమాల టాక్ ఎలా ఉన్నా .. రూ.400 నుండీ రూ.700 కోట్లు కలెక్ట్ చేస్తాయి. పారితోషికం విషయంలో కూడా ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ లో ప్రభాస్ ఉన్నట్టు అంతా చెబుతూ ఉంటారు. ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయినా మంచు విష్ణు (Manchu Vishnu) కన్నప్ప లో (Kannappa) ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత పారితోషికం అనుకుంటున్నాడు అనే విషయం పై అలాగే టాలీవుడ్ హీరోల పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
మంచు విష్ణు మాట్లాడుతూ..”మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టాలీవుడ్ నుండి మొట్ట మొదటిగా పద్మవిభూషణ్ ని అందుకున్నారు. చాలా గర్వంగా అనిపించింది. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి స్టార్స్ తో పోటీపడుతున్నాడు. ప్రభాస్ అయితే ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ నటుడు అలాగే తన సినిమా వస్తుంది అంటే అనేక దేశాల్లో ఎదురు చూసేవారు కూడా ఉన్నారు.
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) బ్రదర్ రాజమౌళి (Rajamouli) గారి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బహుశా ఇండియాలోనే అతి పెద్ద బడ్జెట్ చిత్రం అవుతుంది. ఇదీ మన తెలుగు సినిమానే అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ‘ ‘కన్నప్ప’ కోసం ప్రభాస్ ఎంత తీసుకుంటున్నారు?’ అని మంచు విష్ణుని అడగ్గా.. ప్రభాస్ మా సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదు.అది డార్లింగ్ అంటే..కానీ నా తరఫున రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది.’ అంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.