జర్నలిస్టు కుటుంబానికి 22 లక్షల సహాయం చేసిన మంచు విష్ణు..!
July 7, 2016 / 05:26 AM IST
|Follow Us
రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ గ్రేట్ హీరో అనిపించుకున్నాడు మంచు విష్ణు. పక్షవాతానికి గురైన ఓ నిరుపేద జర్నలిస్టు జీవితానికి కొత్త ఆశలు చిగురింపజేశాడు. జర్నలిస్టు దుర్గాగౌడ్ హెల్త్ కోసం సహాయం చేశాడు. ఆయన పిల్లలను చదివించేందుకు 22 లక్షల విలువైన ఎడ్యుకేషన్ అందించేందుకు ముందుకొచ్చాడు.
ఏడాది కాలంగా పక్షవాతంతో మంచం పట్టి చావుబతులకులతో పోరాడుతున్న జర్నలిస్టు దుర్గాగౌడ్ కష్టాలను చూపుతూ మేముసైతం కార్యక్రమం తెరపైకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో గెస్టు సెలబ్రెటీగా పాల్గొన్న మంచు విష్ణు.. బాధిత జర్నలిస్టు కష్టాలను విని కదిలిపోయాడు. ఒక్క రోజు పానీపూరి అమ్మి తన వంతుగా 75,000 రూపాయలు సంపాదించాడు. వాటిని జర్నలిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం చేస్తూ ఆయన పిల్లలిద్దరికి నర్సరీ నుంచి ఇంటర్ వరకు 22 లక్షల విలువైన కార్పోరేట్ విద్యను, వారి బాధ్యతలు చూసుకుంటానని ప్రకటించాడు. ఈ భారీ సహాయానికి విష్ణుపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. నిజ జీవితంలోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మంచువిష్ణుకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
మంచులక్ష్మి కూడా తనవంతుగా లక్ష రూపాయల సహాయం ప్రకటించింది. మొత్తం 1 లక్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కుటుంబానికి అందించారు. అంటే దాదాపుగా 24 లక్షల రూపాయల సహాయం అందించిన మంచు విష్ణు, మంచు లక్ష్మిలకు హ్యాట్సాప్ చెబుతున్నాం. దొంగాట మూవీ డైరెక్టర్ వంశీకృష్ణకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు జర్నలిస్టులు. జర్నలిస్టు దుర్గా జీవితానికి భరోసా అందించేందుకు సహాయ పడుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..