Martin Luther King: ‘మండేలా’ టు ‘మార్టిన్‌.. ఏం జరిగిందంటే?

  • October 23, 2023 / 05:15 PM IST

తమిళంలో యోగిబాబు ‘మండేలా’ సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో మనకు తెలిసిందే. రాజకీయాలు – ఎన్నికల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు మంచి ఆదరణే దక్కింది. నాయకుల కోణాన్ని చూపించే సినిమాలకు భిన్నంగా ఎందుకు వేయాలని ప్రశ్నించే కోణంలో సాగిన సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ అనే పేరుతో వస్తోంది. ఈ సినిమాను మాహిళా దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఫస్ట్‌ ఛాయిస్‌ ఆమె కాదట.

విజయవాడలో పుట్టి పెరిగిన పూజ కొల్లూరుకు ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ సినిమా అవకాశం అనుకోకుండా వచ్చిందట. ఈ సినిమా అక్టోబరు 27న విడుదలవుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా అవకాశం తనకు ఎలా వచ్చింది అనే విషయం కూడా చెప్పుకొచ్చారు. అమెరికాలో ఫిలిం మేకింగ్‌కి సంబంధించి ఉన్నత విద్యని అభ్యసించిన పూజ సొంతూరు విజయవాడ. అక్కడే పుట్టి పెరిగిన ఆమె కేంద్రీయ విద్యాలయంలో చదివారు. ఆ తర్వాత యునైటెడ్‌ వరల్డ్‌ కాలేజ్‌ ఆఫ్‌ మహీంద్రలో ఉన్నత విద్య అభ్యసించారు.

‘పాన్స్‌ లాబిరింత్‌’ అనే స్పానిష్‌ సినిమా చూసి… తన ఆలోచనను మార్చుకున్నారు. సైంటిస్ట్‌ లేదా ఐఏఎస్‌ కావాలనే కలతో ఉన్న పూజ… ఆ ఆలోచనలు పక్కనపెట్టి సినిమాలవైపు వచ్చేశారు. ఫిల్మ్‌ మేకింగ్‌లో ఉన్నత చదువు అయిపోయాక వైజయంతీ మూవీస్‌లో పనిచేశారట. వెంకటేశ్‌ మహా కొత్త చిత్రం ‘మర్మాణువు’ కోసం పూజకు పిలుపు వచ్చిందట. అప్పుడే ‘మండేలా’ రీమేక్‌ కోసం వెంకటేశ్‌ మహాను వై నాట్‌ స్టూడియోస్‌ సంప్రదించారట. అయితే ఆయన ఆసక్తి చూపించకపోవడంతో పూజ సీన్‌లోకి వచ్చారట.

‘మండేలా’ సినిమా ఆధారంగానే (Martin Luther King) ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ చేసినా, పూర్తిగా భిన్నమైన కథలా సినిమా సిద్ధం చేశామని పూజ చెబుతున్నారు. వర్తమాన రాజకీయాలపై కౌంటర్లు పడేలా కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయట. అయితే ఎవరినీ నొప్పించకుండా సినిమాను తీర్చిదిద్దామని చెబుతున్నారామె. అయితే ఇప్పటికే ట్రైలర్‌లోని ‘రూ. 15 వేలు పంపిణీ’ అంశం రాజకీయాల్లో చర్చలకు దారి తీసింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus