Mangalavaaram: పేరు ఏదైనా అజయ్‌ భూపతి ఇంకా భయపెడుతూనే ఉంటారట… క్లారిటీ ఇచ్చేశారు!

  • November 15, 2023 / 04:08 PM IST

హిట్‌ సినిమాకు, సూపర్‌ హిట్‌ కాన్సెప్ట్‌కు ఎప్పుడూ మరో సినిమా రెడీగా ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో సీక్వెల్‌ అంటే భయపడేవాళ్లు. సరైన విజయం దక్కకుండా అలాంటి సినిమాలు ఇబ్బందిపెడుతున్నాయి అనే మాట ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. సినిమాలు రెండు ముక్కలవుతున్నాయి. సీక్వెల్స్‌, ఫ్రాంచైజీలు వస్తున్నాయి. తాజాగా ‘మంగళవారం’ సినిమాకుకి కూడా ఓ ఫ్రాంచైజీ లాంటిది ఏర్పాటు చేస్తున్నారట. అయితే దానికి ఏం పేరు ఉంటుంది అనేది చెప్పలేం అంటున్నారు.

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు పార్ట్ 2, సీక్వెల్, ప్రీక్వెల్, ప్రాంచైజీ అంటూ ప్లానింగ్ చేసుకునే తీసుకొస్తున్నారు. తొలి సినిమా ఫలితం తేడా కొడితే ఆ ఆలోచన పక్కకు వెళ్లిపోతుంది. ‘పెదకాపు’, ‘స్కంద’ అలాంటివే. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ‘మంగళవారం’ సినిమా రాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘మంగళవారం’ దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాకు పార్ట్ 2 ఉండబోతుంది అని చెప్పారు.

‘మంగళవారం’ (Mangalavaaram) సినిమాకు పొడిగింపు ఉంటుంది. అయితే సీక్వెలా, ప్రీక్వెలా, ఫ్రాంచైజీనా అనేది ఇంకా తెలియదు. సినిమా కొనసాగింపు అయితే ఉంటుంది అని అజయ్‌ భూపతి చెప్పారు. ఇప్పటికే ‘మంగళవారం’ సినిమాలో ఓ డిఫరెంట్‌ పాయింట్‌ చెబుతున్నాం అని టీమ్‌ చెబుతోంది. అంతేకాదు భయపెడుతూ, ఏడిపించేలా ఈ సినిమా ఉంటుంది అని కూడా చెప్పారు. దీంతో పాయింట్ ఏంటి అనే కుతూహలం ఉంది. దానికి తోడు దర్శకుడు అజయ్‌ భూపతి వైవిధ్యం మీద కూడా నమ్మకం ఉంది.

ఒకవేళ పాయింట్ ఆసక్తికరంగా లేకపోయినా, సినిమా సరైన ఫలితం అందుకోకపోయినా సినిమాకు కొనసాగింపు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఈ నెల 17న అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజే ‘మంగళవారం’ థియేటర్లలోకి వస్తుంది. మరి ఆ రోజు పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి. ఏమాత్రం తేడా వచ్చినా సీక్వెల్స్‌, ప్రీక్వెల్స్‌, ఫ్రాంచైజీలు లాంటి ప్రశ్నలు ఇక రావు. కానీ ఇలాంటి కథలు మన వాళ్లకు బాగా నచ్చుతాయి అని మాత్రం చెప్పొచ్చు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus