తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని రూలు లేదు. అందుకే రామ్ గోపాల్ వర్మ ఇష్టముంటే నా సినిమా చూడండి.. లేకుంటే లేదని ఛాయిస్ ఆడియన్స్ కే ఇచ్చారు. అయితే తొలి సారి మెగా ఫోన్ అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ తనయురాలు మంజుల సంచలన కామెంట్స్ చేశారు. ఆమె దర్శకత్వత్వం వహించిన మనసుకు నచ్చింది.. సినిమా నచ్చనివారు వేస్ట్ ఫెలోస్ అని కామెంట్స్ చేశారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దీంతో టాలీవుడ్ వర్గాల వారు అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా నచ్చడం, నచ్చకపోవడం వారి అభిరుచికి సంబంధించిన విషయం.. అంతేకానీ నచ్చలేనంత మాత్రాన వేస్ట్ ఫెలోస్ అనడం మంచిది కాదని సినీ విమర్శకులు హితవు పలుకుతున్నారు. అయితే కృష్ణ అభిమానులు మాత్రం ఆమె మాటలను వక్రీకరించవద్దని సూచిస్తున్నారు. “మనసుకు నచ్చింది..” ఎంతో ఫీలున్న కథతో తెరకెక్కింది.. సినిమా కూడా బాగా వచ్చిందనే నమ్మకంతో, అందరికీ నచ్చుతుందనే ఉద్దేశంతో మంజుల అలా మాట్లాడారని సమర్థిస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్సే ఇందులో ఎంతవరకు నిజముందో తేల్చి చెబుతారు.