‘మన్మధుడు 2’ కి భారీ రేటు పలికిన ‘స్టార్ మా’

  • July 26, 2019 / 01:12 PM IST

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మధుడు2’. రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత కూడా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్, సాంగ్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కచ్చితంగా సినిమా ఆకట్టుకునేలా ఉందనే టాక్ నడుస్తుంది.. అందుకే… బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుంది.

తాజాగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ 7.4కోట్లకు దక్కించుకుందని వార్తలు వచ్చాయి. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ 6.1 కోట్లకు జరిగింది. ఇక ‘స్టార్ మా’ వారు ‘మన్మధుడు 2’ శాటిలైట్ హక్కుల్ని 8.3 కోట్లు పెట్టి కొనుగోలు చేసారంట. నాగార్జున కెరీర్లో ఇదో పెద్ద రికార్డు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తుండగా…. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి వంటి వారు కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus