Jr NTR, Ram Charan: అప్పుడు రిలీజ్ చేస్తే తారక్, చరణ్ మూవీ హిట్టేనా?
March 28, 2022 / 10:39 AM IST
|Follow Us
చరణ్, తారక్ అభిమానులు గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఆర్ఆర్ఆర్ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో చరణ్, తారక్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమా ఫుల్ రన్ లో బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్, తారక్ అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసిందని సమాచారం. సినిమాలో ఫస్టాఫ్ లో ఎన్టీఆర్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కితే సెకండాఫ్ లో రామ్ చరణ్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కింది.
మూడు గంటల నిడివి ఉన్న సినిమా అయినప్పటికీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఎక్కడా బోరింగ్ గా అనిపించలేదు. అయితే మార్చి నెలలో చరణ్, తారక్ సినిమాలు విడుదలైతే ఆ సినిమాలు హిట్టేనని ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా చాలా సంవత్సరాల క్రితం మార్చి నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా మార్చి నెలలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
మార్చి నెల ఒక విధంగా చరణ్, తారక్ లకు లక్కీ మంత్ అని కూడా చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ కూడా సక్సెస్ సాధించడంతో ఫ్యాన్స్ ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు. చరణ్, తారక్ తమ తర్వాత సినిమాలు కూడా మార్చి నెలలో విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ నటించిన ఆచార్య వచ్చే నెలలో విడుదల కానుండగా తారక్ కూడా సినిమాల విషయంలో వేగం పెంచాలని అభిమానులు భావిస్తున్నారు.
సినిమాసినిమాకు చరణ్, తారక్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. చరణ్, తారక్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.