మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి (Producer)
గుణ బాలసుబ్రమణియన్ (Music)
సురేష్ రగుతు (Cinematography)
ఈ వారం అంటే జూన్ చివరి వారంలో ఎక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘మాయా పేటిక’ మూవీ కూడా ఒకటి. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనసూయతో ‘థాంక్యూ బ్రదర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన రమేష్ రాపర్తి డైరెక్ట్ చేశాడు. టీజర్, ట్రైలర్లు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో.. నొప్పించిందో తెలుసుకుందాం రండి :
కథ : ప్రణయ్(రజత్ రాఘవ్), పాయల్(పాయల్ రాజ్ పుత్) ఇద్దరూ చిన్నప్పటినుండీ ప్రేమించుకుంటారు. అయితే పాయల్ కి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనేది కోరిక. ‘లాల్ సింగ్ చద్దా’ లో కరీనా కపూర్ లా అన్నమాట. అయినప్పటికీ ఆమె లవర్ ప్రణయ్ అందుకు ఒప్పుకుని సహకరిస్తాడు.ఈ క్రమంలో ఆమెకి ఓ నిర్మాత మొబైల్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు.దానికి పాయల్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అయితే ఇది ప్రణయ్ కు నచ్చదు.
దీంతో వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. దీంతో ఈ ఫోన్ ను తన అసిస్టెంట్ కి ఇస్తుంది పాయల్. కానీ అది ఊహించని విధంగా చాలా మంది చేతులు మారుతుంది. అది ఎలా? ఎవరెవరి జీవితాల్లోకి ఈ ఫోన్ వెళ్లి.. ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది? సునీల్, శ్యామల , శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ రాజ్, హిమజ వంటి వారి పాత్రలు ఏమిటనేది..? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు : పాయల్ రాజ్పుత్ మెయిన్ రోల్ చేసింది. ఆమెలో మంచి నటి ఉంది. అయినా సరే ఎందుకో ఈ సినిమాలో కూడా గ్లామర్ కే పరిమితమైనట్టు అనిపిస్తుంది. ఆమె పాత్రకి తగ్గట్టు బాగానే చేసింది. 30 ఇయర్స్ పృథ్వీ చాలా కాలం తర్వాత తన మార్క్ కామెడీతో అలరించాడు. ‘విప్పేయ్’ అంటూ కన్నె కామేశ్వరరావు పాత్రలో కాసేపు నవ్వులు పూయించాడు.’మిర్చి’ కిరణ్ కూడా అక్కడక్కడా నవ్వించాడు. సునీల్, శ్యామల టాక్ మొత్తం టిక్ టాక్ దుర్గారావు అండ్ ఫ్యామిలీని ఇమిటేట్ చేసినట్టు ఉంది.
సో వీళ్ళు ఎలా చేసినా జనాలకి వాళ్ళే గుర్తుకొచ్చారు అని చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి డబ్బు కోసం రకరకాల వేషాలు వేసే వ్యక్తిగా కనిపించాడు.ఇతని పాత్ర రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పాలి. సిమ్రత్ కౌర్, విరాజ్ అశ్విన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
సాంకేతిక నిపుణుల పనితీరు : ‘మాయా పేటిక’ను కథ చెప్పుకుంటే బాగానే ఉంది. కానీ కథనంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. దర్శకుడు రమేష్ చెప్పాలనుకున్న పాయింట్ అందరికీ అర్థమైనా.. అది ఆకట్టుకునే విధంగా లేదు అని ప్రత్యేకంగా చెప్పాలి.ఫోన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి అన్నది.. మొన్నామధ్య వచ్చిన ‘లవ్ టుడే'(తమిళ్) సినిమాలో బాగా చూపించారు. అయితే ‘మాయా పేటిక’ విషయంలో దర్శకుడు కొంచెం రియాలిటీకి దగ్గరకి వెళ్ళాలి అనుకున్నాడు.
అందులో కూడా తప్పు లేదు.. కానీ అలా ప్రయత్నిస్తున్నప్పుడు కామెడీతో ఇంకా ఇంప్రొవైజ్ చేయాలి అనుకోవడంలో అతను బ్యాలెన్స్ తప్పాడు అని చెప్పాలి. టెక్నికల్ గా కూడా ఈ సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. కన్నె కామేశ్వర రావుగా ’30’ ఇయర్స్ పృథ్వీ ఎపిసోడ్ అలరిస్తుంది. ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ని తలపించేలా ఆయన పాత్ర ఉంటుంది. అతను గతంలో అతను చెప్పిన ‘వెనుక నుంచి వచ్చి వాటేసుకుందాం’ అనుకున్నాను అనే డైలాగ్ ను కూడా ఇందులో వాడేశారు.
విశ్లేషణ: అక్కడక్కడా కొన్ని నవ్వుకునే మూమెంట్స్ తప్ప ‘మాయా పేటిక’ లో అలరించే అంశాలు పెద్దగా ఏవీ లేవు. రన్ టైం 2 గంటల 22 నిమిషాలు మాత్రమే కావడంతో ఓపిక ఉంటే ట్రై చేయొచ్చు. లేదంటే లైట్ తీసుకోవచ్చు.
రేటింగ్ : 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus