మెగాస్టార్ చిరంజీవికి చురకలు అంటించిన వైద్య ఆరోగ్య శాఖ.. కారణం అదే..!
November 16, 2020 / 03:26 PM IST
|Follow Us
నవంబర్ 9న మెగాస్టార్ చిరంజీవి.. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.’ఆచార్య’ చిత్రం షూటింగ్లో జాయిన్ అవ్వడం కోసం.. కరోనా టెస్ట్ చేయించుకోగా, రిపోర్ట్స్ లో పాజిటివ్ వచ్చినట్టు ఆయన తెలిపారు. ఎటువంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వచ్చినట్టు కూడా ఆయన వెల్లడించారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కూడా ప్రత్యేక పూజలు వంటివి చేశారు. అయితే కొద్దిపాటి చికిత్స అనంతరం ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందని కూడా ఆయన తెలిపారు.
దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అంతా బానే ఉంది కదా.. ? మరి చిరు తీరు పై వైద్య ఆరోగ్య శాఖ మండిపడడం ఏంటి అని అందరికీ అనుమానం రావచ్చు. విషయం ఏమిటంటే..కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ప్రతీ ఒక్కరు రెండు వారాల పాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలనే రూల్ ఎప్పటి నుండో ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి దీపావళి సందర్బంగా ఆయన గురువు అయిన కళాతపస్వి కె విశ్వనాథ్ గారిని వెళ్లి కలిశారు. అందుకే ఆరోగ్య శాఖ మండిపడినట్టు స్పష్టమవుతుంది.
విశ్వనాథ్ గారితో.. చిరంజీవి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చిరుకి మెసేజ్ చేసినట్టు సమాచారం. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ నిబంధనల ప్రకారం చిరంజీవి కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిందే అని ఆ మెసేజ్‌లో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ అయిన డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారట.