అభిమానులకు షాకిచ్చిన మీరా జాస్మిన్

  • February 14, 2018 / 12:28 PM IST

‘అమ్మాయి బాగుంది’ అనే సినిమా ద్వారా మలయాళ నటి మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. పూర్తి కమర్షియల్ చిత్రాల్లో నటించినప్పటికీ స్కిన్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది. భద్ర, యమగోల మళ్ళీ మొదలైంది సినిమాలతో విజయం అందుకుంది. గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో హిట్స్ లేకపోవడంతో మలయాళం, తమిళ భాషల్లో సినిమాలకి పరిమితమయింది. సినిమాల్లో బిజీగా ఉండగానే అనిల్ జాన్ అనే వ్యక్తిని మీరా జాస్మిన్ 2014 లో పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత సైన్ చేసిన ప్రాజక్ట్ లను కంప్లీట్ చేసి నటనకు టాటా చెప్పింది. ఇన్ని రోజులుగా మీడియాకి కూడా దూరంగా ఉన్న ఈ భామ తాజాగా కెమెరాకి చిక్కింది. ఓ జ్యువెలరీ షాప్ లో ఉన్న మీరాని చూసిన వారంతా షాక్ తింటున్నారు. ఆమె పూర్తిగా మారిపోయింది. బాగా లావుగా తయారైంది. చీరకట్టులో ఉన్న ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరా జాస్మిన్ ఏంటి ఇలా ఉంది? అని కొంతమంది విమర్శిస్తుంటే.. మరికొంతమంది మాత్రం పెళ్లి అయిన తర్వాత ఆ మాత్రం బరువు పెరగరా? అని మీరాపై అభిమానాన్ని కురిపిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus