Nagababu: వేట కొడవలి చేతిలో పట్టుకొని హింసే మార్గం అంటున్న నాగబాబు!

  • May 15, 2023 / 08:12 PM IST

మెగా బ్రదర్ నాగబాబు గురించి పరిచయం అవసరం లేదు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగుతున్న పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు ఇండస్ట్రీకి కాస్త దూరమై రాజకీయాలలో చాలా యాక్టివ్ గా ఉన్నారనే చెప్పాలి.నాగబాబు సోషల్ మీడియా వేదికగా తరచూ చేసే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ చేసిన అది రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది.

అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు ఎక్కువగా వైఎస్ఆర్సిపి పార్టీని ఉద్దేశించి పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈయన చేసే కామెంట్స్ జన సైనికులకు కూడా కాస్త చిరాకు తెప్పిస్తూనే ఉంటాయి. ఇలా ప్రతిసారి ఈయన పలువురిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తుంటారు. ఇక నాగబాబు జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా (Nagababu) ఈయన వైసిపి పార్టీని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారా లేక ఏదైనా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ పోస్ట్ చేశారా అన్న విషయం తెలియదు కానీ ప్రస్తుతం నాగబాబు చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో నాగబాబు వేట కొడవలి చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటో షేర్ చేయడమే కాకుండా మంచి అనేది విఫలం చెందినప్పుడు న్యాయం శాంతి సాధించడం కోసం హింసే మార్గం అంటూ ఈయన ఈ ఫోటోని షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉండడంతో ఈ ఫోస్ట్ పై పలువురు స్పందిస్తూ బహిరంగంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నేరమంటూ కామెంట్లు చేస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus