ఓటీటీ హవా సెకండ్ వేవ్ లో అంతకంతకు పెరుగుతూనే ఉంది. కరోనా కారణంగా నెట్ ఫ్లిక్స్ కు అలాగే ఆమెజాన్ ప్రైమ్ పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తుండగా కేవలం తెలుగు వారిని టార్గెట్ చేస్తూ ఆహా యాప్ కూడా భారీగా ఖర్చు చేస్తోంది. ఎవరు ఎంత పోటీగా వచ్చినా కూడా ముందు నుంచి అమెజాన్ డామినేషన్ ఎక్కువయ్యింది. ఇక త్వరలోనే మరో మెగా హీరో సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆ సినిమా మరేదో కాదు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి. ఈ మూవీ గత ఏడాది విడుదల కావాల్సింది. సెట్స్ పైకి వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. మధ్యలో ఆర్థికంగా ఇబ్బందులు రాగా మరోసారి కరోనా వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఇక థియేటర్స్ ఓపెన్ అయితే పెద్దగా పోటీ లేనప్పుడు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదని తెలియడంతో ఓటీటీ సంస్థలతో బేరానికి దిగారు. గతంలో కొన్ని మంచి ఆఫర్స్ వచ్చినా అమ్మలేదట.
కానీ ఇప్పుడు కూడా ఓటీటీ డీల్ కు ఒప్పుకోకపోతే మొదటికే మోసం వస్తుందని నిర్మాత ఎదో ఒక రేటుకు డీల్ క్లోజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకునే ఛాన్స్ ఉందట. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ఓటీటీలో విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!