మెగా హీరోయిన్ కు ఇప్పుడైనా కలిసొస్తుందా!!

  • May 1, 2021 / 07:07 PM IST

హీరోయిన్లకు మొదటి సినిమాతో హిట్టు కొట్టడం అంత ఈజీ కాదు. కానీ హిట్టు కొడితేనె వాళ్లకు ఛాన్సులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని కొందరు చెబుతుంటారు. అయితే హిట్టు కొట్టకపోయినా స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. కాకపోతే వాళ్లకు ఎక్కువ సమయం పట్టింది.చిత్ర సీమలో ఒక్కోసారి అసాధ్యం అనుకున్నవి సాధ్యం అవుతుంటాయి.అయితే మొదటి సినిమాతోనే మంచి హిట్టు అందుకున్న మృణాళిని ర‌వి మాత్రం ఇంకా రెండో సినిమా అవకాశం సంపాదించలేకపోయింది.

ఈమె వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తన నటనతో తెలుగు ప్రేక్షకులతో మంచి మార్కులే వేయించుకుంది. కామెడీ కూడా చేసి అలరించింది ఈ బ్యూటీ. హరీష్ శంకర్ డైరెక్షన్లో చేసిన హీరోయిన్లకు సుడి తిరుగుతుంది అని ఓ మంచి సెంటిమెంట్ ఉంది.కానీ ఈమె విషయంలో అలా జరగలేదు. ప్రస్తుతం తమిళంలో ఈమె 3 సినిమాలు చేస్తోంది.

అయితే మృణాళిని ర‌వి ఇటీవల తన మేనేజర్ ను మార్చేసిందట. తెలుగులో అవకాశాలు వచ్చేలా కొత్త మేనేజర్ తో ప్రయత్నాలు మొదలుపెట్టింది అని ఇన్సైడ్ టాక్. మరి ఆమెకు ఇలా అయినా కలిసొస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus