మాస్ సినిమా రీమేక్ కు క్లాస్ డైరెక్టర్ ఎట్టా సెట్ అవుతాడబ్బా

  • February 13, 2020 / 01:19 PM IST

అప్పటికే తెలుగు థియేటర్లలో విడుదలై, అమేజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న “లూసిఫర్” సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ కొన్నాడు అంటేనే జనాలు షాక్ అయ్యారు. అందులోనూ ఆ రీమేక్ లో చిరంజీవి నటించనున్నారని తెలిసి ఇంకాస్త గట్టిగానే షాక్ తిన్నారు. అయితే.. నిన్నటి నుండి లూసిఫర్ తెలుగు రీమేక్ విషయంలో వస్తున్న అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ కు నిద్రలేకుండా చేస్తున్నాయి. తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ ను సుకుమార్ రాస్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంటే.. తెలుగు వెర్షన్ కు “గీత గోవిందం” ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తారని వస్తున్న వార్తలు మాత్రం బెంబేలెత్తిస్తున్నాయి.

పరశురామ్ “లూసిఫర్” లాంటి సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేయగల సత్తా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. అనుభవం మాత్రం లేదు. ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నీ క్లాస్ సినిమాలే. “యువత” మాస్ సినిమా అయినప్పటికీ క్లాస్ యాంగిల్ లోనే నడుస్తుంది. దాంతో.. లూసిఫర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా, అది కూడా చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలకపాత్రలో నటించే అవకాశం ఉన్న చిత్రాన్ని పరశురామ్ చేతిలో పెట్టడం రిస్క్ అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మెగా కాంపౌండ్ ఏదో క్లారిటీ ఇస్తే బాగుండు.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus