Chiranjeevi: రిలీజ్ సమయానికి ఆచార్య పరిస్థితి మారుతుందా?
April 22, 2022 / 07:56 PM IST
|Follow Us
ఆచార్య సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. మెగా ఫ్యాన్స్ తమ అంచనాలను మించి ఈ సినిమా ఉండబోతుందని భావిస్తున్నారు. అయితే కొన్ని విషయాలు మాత్రం మెగా ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఆచార్య థియేట్రికల్ ట్రైలర్ రొటీన్ గానే ఉండటంతో ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు అయితే ఏర్పడలేదనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసిన ప్రేక్షకులు మరో సినిమా కోసం ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఖర్చు చేయడం సులువైన విషయం కాదు.
మెగా అభిమానులు ఆచార్య సినిమాను చూస్తారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే సామాన్య ప్రేక్షకులు సినిమాను చూడాలంటే యునానిమస్ పాజిటివ్ టాక్ కీలకమని చెప్పవచ్చు. ఆచార్యపై కేజీఎఫ్2 ఎఫెక్ట్ ఉంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేజీఎఫ్2 బాక్సాఫీస్ వద్ద కనీసం మూడు వారాల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు సంబంధించి ఇచ్చే అప్ డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేలా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఓవర్సీస్ లో ఆచార్య ప్రీమియర్స్ కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ అయితే జరగడం లేదని బోగట్టా. అయితే రిలీజ్ సమయానికి పరిస్థితి మారుతుందని మేకర్స్ భావుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఈ సినిమాకు కీలకం కానున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కి 3400 థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. కొరటాల శివ మాత్రం ఇప్పటివరకు తన సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరచలేదు.
ఆచార్య సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారు. అయితే నాన్ థియేట్రికల్ హక్కులు రికార్డు రేటుకు అమ్ముడవడం నిర్మాతలకు కలిసొచ్చింది. ఏపీలో టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతులు ఇస్తే ఆచార్యకు మరింత బెనిఫిట్ కలుగుతోంది.