ఘనంగా చిరంజీవి – సురేఖ ల 43 పెళ్ళి రోజు వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు
February 21, 2023 / 05:13 PM IST
|Follow Us
టాలీవుడ్ లో ఉన్న ఆదర్శ జంటల్లో చిరంజీవి – సురేఖ లు ఒకరు. ఈ జంట ఫోటోలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ ఫిబ్రవరి 20 న చిరు – సురేఖ లు తమ 20 వ పెళ్ళి రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. 1980 లో వీరి పెళ్లి జరిగింది.సురేఖ గారు.. స్టార్ కమెడియన్, గీత ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అయిన అల్లు రామలింగయ్య గారి కుమార్తె అన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి కహానీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
అల్లు రామలింగయ్య గారి ఇంటికి అతిథిగా వెళ్లిన చిరంజీవి .. సురేఖ కి అలాగే వారి కుటుంబ సభ్యులకు నచ్చడంతో .. చిరు కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి కుదుర్చుకున్నారు. చిరంజీవి టాలెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. వీరికి సుస్మిత, శ్రీజ, చరణ్ లు సంతానం. ఇక వీరి 43 వ పెళ్లిరోజు సందర్భంగా వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి: