Chiranjeevi: చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఇంత కష్టం ఉందా?
January 27, 2024 / 12:31 PM IST
|Follow Us
స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంతో సినీ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రముఖ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది. రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించి చిరంజీవి లక్ష్యాలను సాధించి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు. అయితే ఈ స్థాయికి చేరుకోవడం కోసం చిరంజీవి అనుభవించిన అవమానాలు అన్నీఇన్నీ కావు.
హైస్కూల్ లో ఒక నాటకంలో పరంధామయ్య అనే పాత్రను పోషించిన చిరంజీవి తన యాక్టింగ్ స్కిల్స్ తో నాటకాల ద్వారా ఎన్నో అవార్డులను అందుకున్నారు. నాన్న సినిమాల్లోకి వద్దని చెప్పినా చిరంజీవి మాత్రం రైలెక్కారు. మనవూరి పాండవులు సక్సెస్ తో చిరంజీవికి కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఖైదీ, మరణ మృదంగం సినిమాలతో చిరంజీవి మెగాస్టార్ అయ్యారు.
ఒకసారి ఒక సినిమా ప్రివ్యూ చూడటానికి వెళ్లిన చిరంజీవి, అతని స్నేహితులను హీరో డ్రైవర్, మేకప్ మ్యాన్ లు కూర్చున్న సీట్ల నుంచి లేపడంతో వాళ్లు నిలబడి సినిమా చూశారు. ఆ అవమానం వల్లే చిరంజీవి ఇండస్ట్రీలో నంబర్ వన్ కావాలని అనుకుని నంబర్ వన్ అయ్యారు. ఒకవైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రాజకీయాల్లో సైతం సత్తా చాటాలని, సంచలనాలు సృష్టించాలని చిరంజీవి (Chiranjeevi) భావించినా అక్కడ ఆశించిన ఫలితాలు రాలేదు.
వ్యక్తిగత వెబ్ సైట్ కలిగిన తొలి భారతీయ స్టార్ హీరో చిరంజీవి కావడం గమనార్హం. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుని కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న చిరంజీవి విశ్వంభర, భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ రేంజ్ లో తెరకెక్కుతుండటం గమనార్హం.