Chiranjeevi: అదీ మెగాస్టార్ అంటున్న మెగా అభిమానులు.. అసలేమైందంటే?

  • March 6, 2024 / 01:21 PM IST

ముకేశ్ అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ వేడుక కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయిందని తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఈ స్థాయిలో ఖర్చు చేశారంటే పెళ్లి వేడుకలకు ఏ స్థాయిలో ఖర్చు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ డ్యాన్స్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆ హీరోలు ముకేశ్ అంబానీపై అభిమానంతో డ్యాన్స్ చేయలేదని కోట్ల రూపాయలు పారితోషికంగా ఇస్తే డ్యాన్స్ చేశారని తెలుస్తోంది.

అయితే చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి (Chiranjeevi) పెద్ద కూతురు సుస్మిత (Sushmita Konidela) పెళ్లి వేడుకలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, యంగ్ హీరోలు డ్యాన్స్ చేశారు. చిరంజీవిపై అభిమానంతో టాలీవుడ్ స్టార్స్ డ్యాన్స్ చేయడం జరిగింది. ఈ విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అదీ మెగాస్టార్ అంటే అంటూ మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో రావు రమేష్ (Rao Ramesh) విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చ్జేసుకున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి విశ్వంభర (Vishwambhara) సినిమా తర్వాత కొత్త సినిమాలను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది.

విశ్వంభర సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. త్రిష (Trisha) ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus