Megastar Chiranjeevi: షూటింగ్లో గాయపడ్డ మెగాస్టార్..అయినా?

  • March 31, 2022 / 11:50 PM IST

షూటింగ్లో పాల్గొంటున్న టైములో హీరోలకు గాయాలు అవ్వడం సర్వసాధారణమైన విషయం. ఇలాంటి సమయాల్లో హీరోలు షూటింగ్లు ఆపేసి వెళ్ళిపోవడం కూడా మాములు విషయమే. అయితే కొంతమంది హీరోలు వీటిని తట్టుకుని మరీ షూటింగ్లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ‘ఆది’ టైములో ఎన్టీఆర్, ‘ఒక్కడు’ ‘నిజం’ ‘పోకిరి’ సినిమాల టైములో మహేష్ బాబు, ‘బాహుబలి’ టైములో ప్రభాస్, ‘రచ్చ’ టైంలో చరణ్, ‘వరుడు’ టైములో అల్లు అర్జున్.. ఇలా షూటింగ్ ల టైములో గాయాల పాలయ్యారు.

Click Here To Watch NOW

అయితే వీళ్ళంతా ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు. కానీ సీనియర్ స్టార్ హీరోలు కూడా ఈ వయసులో వీళ్ళతో పోటీపడి వరుస సినిమాల్లో నటించడమే కాకుండా రిస్కీ షాట్స్ లో కూడా నటిస్తున్నారు. గాయాల పాలైన అస్సలు తగ్గడం లేదు. ‘అఖండ’ టైములో బాలయ్య చేతికి గాయం అయినా ‘జై బాలయ్య’ షూటింగ్ ఫినిష్ చేసాడు. ఇప్పుడు చిరంజీవి కూడా గాయాలు పాలైనా లెక్క చెయ్యకుండా షూటింగ్లో పాల్గొని చరిత్ర సృష్టించాడు.

నిజానికి మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఇలాంటి రిస్క్ లు ఎన్నో చేశారు. చేతులు, కాళ్ళు విరగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని లెక్క చేయకుండా షూటింగ్లలో పాల్గొని నిర్మాత నష్టం కలగకుండా ఆదుకున్నారు. అయితే 65 ఏళ్ళ వయసులో కూడా అంతే జోష్ తో ఆయన పనిచేస్తున్నారు. విషయం ఏంటంటే బాబీ దర్శకత్వంలో చిరు చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే ఓ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చిరు ఏనుగు మీద నుండీ దిగుతూ కాలు జారి కిందికి పడిపోయారట.

ఆయన కాలుకి గాయం కూడా అయ్యింది. అయినా సరే షూటింగ్ కు ఇబ్బంది కలుగకుండా.. మిగిలిన నటీనటుల కాల్షీట్లు వేస్ట్ అవ్వకుండా తట్టుకుని మరీ షూటింగ్ ను ఫినిష్ చేశారట.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus