Acharya Movie: అలా జరిగితే మాత్రం ఆచార్యకు నష్టమేనా?
April 28, 2022 / 12:43 PM IST
|Follow Us
చిరంజీవి, చరణ్ ప్రమోషన్స్ లో చాలా కష్టపడుతున్నా ఆచార్యపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే ఏర్పడటం లేదు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలను చూసిన ప్రేక్షకులు ఆచార్య సినిమా టాక్ ను బట్టి టికెట్లను బుకింగ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారని ఈ సినిమా బుకింగ్స్ ను చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ లో ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నా ఇతర ప్రాంతాల్లో మాత్రం సినిమా బుకింగ్స్ దారుణంగా ఉండటం గమనార్హం.
అయితే నెగిటివ్ సెంటిమెంట్స్ సైతం ఈ సినిమా అభిమానులను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఆచార్య సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రియల్ హీరో అయిన సోనూసూద్ ను ప్రేక్షకులు విలన్ గా యాక్సెప్ట్ చేయడం సులువు కాదు. సోనూసూద్ ను విలన్ గా యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
సోనూసూద్ ను ప్రేక్షకులు విలన్ గా యాక్సెప్ట్ చేయని పక్షంలో మాత్రం ఆచార్య మూవీకి నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. పూజా హెగ్డే నెగిటివ్ సెంటిమెంట్, జక్కన్న డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ కూడా మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమాలలో ఖిలాడీ మినహా మరే సినిమా ప్రేక్షకులను నిరాశపరచలేదు.
ఆచార్య కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆచార్య సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా మేకర్స్ వాటిని రివీల్ చేయడం లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. సినిమాలో కాజల్ పాత్రను పూర్తిగా తీసేశారని తెలుస్తోంది. ఆచార్యలో అనుష్క గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని వార్తలు వస్తున్నా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.