Mehreen Kaur: హవీష్ తో రొమాన్స్ కి రెడీ!

  • August 4, 2021 / 02:22 PM IST

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఆ తరువాత శర్వానంద్, రవితేజ లాంటి హీరోలతో కలిసి నటించింది. అవకాశాలు వచ్చినా.. స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. మిడ్ రేంజ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చెలామణి అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో చిన్న హీరోలతో కూడా కలిసి నటించడానికి రెడీ అయిపోతుంది ఈ బ్యూటీ. ఈ మధ్యనే సంతోష్ శోభన్ తో కలిసి ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమాలో నటించింది.

మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. త్వరలోనే థియేటర్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మెహ్రీన్ మరో కుర్ర హీరోతో రొమాన్స్ కు రెడీ అయిపోయింది. తెలుగులో ‘జీనియస్’, ‘నువ్విలా’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో నటించిన హవీష్ కోనేరు హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ‘అడ్డా’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను సంప్రదించగా..

ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus