వచ్చే నెలలో మెహ్రీన్ ఎంగేజ్మెంట్..?

  • February 15, 2021 / 11:48 AM IST

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు మెహ్రీన్ వంతు వచ్చింది. నిజానికి మెహ్రీన్ వయసు పాతికేళ్లే. ఆమెకి ఇంకా చాలా కెరీర్ ఉంది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటుంది. ఇంట్లో వాళ్లు చూసిన సంబంధానికి ఓకే చెప్పేసిందట. నిజానికి గతంలోనే మెహ్రీన్ పెళ్లి వార్తలు హల్చల్ చేశాయి.

అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ కు పెళ్లి సెట్ అయిందట. పెళ్లి కొడుకు భవ్య బిష్ణోయ్ తండ్రి కుల్దీప్. ప్రస్తుతం ఆయన అదంపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. భవ్య బిష్ణోయ్ కూడా తన తండ్రి, తాతయ్య మాదిరి రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నాడు. ఇతడితో వచ్చే నెల 13న వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. రాజస్థాన్ లోని జైపూర్ లో వీరి నిశ్చితార్ధం ఉంటుందని సమాచారం.

పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. పెళ్లి తరువాత మెహ్రీన్ సినిమాలకు దూరంగా ఉంటుందని చెబుతున్నారు. టాలీవుడ్ లో కొన్ని హిట్టు సినిమాల్లో నటించిన మెహ్రీన్ ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తోంది. అవకాశాలు వస్తోన్న ఈ సమయంలో మెహ్రీన్ పెళ్లికి రెడీ అవుతుండడం ఆశ్చర్యం. మరి ఈ పెళ్లి వార్తలపై మెహ్రీన్ స్పందిస్తుందేమో చూడాలి!

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus