Mehreen Pirzada: రెండు నెలలు బాధ పడ్డానన్న మెహ్రీన్!

  • November 1, 2021 / 01:36 PM IST

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మెహ్రీన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్న మెహ్రీన్ కు ఆ తర్వాత కాలంలో నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయి. ఎఫ్2 మూవీ మెహ్రీన్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెహ్రీన్ నటించిన మంచి రోజులు వచ్చాయి సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెహ్రీన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మంచి బ్యానర్, మంచి దర్శకుల డైరెక్షన్ లో ఛాన్స్ వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ఆమె తెలిపారు. మారుతిపై ఉండే నమ్మకం వల్ల వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని మెహ్రీన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో పద్మ అనే యువతిగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తానని మెహ్రీన్ పేర్కొన్నారు. మారుతి కథను మలచిన తీరు నచ్చిందని ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నానని మెహ్రీన్ అన్నారు.

ప్రస్తుతం లైనప్ లో చాలా సినిమాలు ఉన్నా ఎఫ్3 సినిమాకు తన తొలి ప్రాధాన్యత ఇస్తానని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ ను తాను పట్టించుకోనని మెహ్రీన్ అన్నారు. కరోనా బారిన పడిన సమయంలో రోజులు భయంగా గడిచాయని రెండు నెలలు వీక్ నెస్ తో బాధ పడ్డానని మొత్తానికి కరోనా నుంచి బయటపడ్డానని మెహ్రీన్ తెలిపారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో ఛాన్స్ వస్తే తాను కథ వినకుండా ఓకే చెబుతానని ఆయన వల్లే తాను ప్రేక్షకుల ముందు ఉన్నానని మెహ్రీన్ వెల్లడించారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus