Mem Famous Collections: ‘మేమ్ ఫేమస్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • June 28, 2023 / 12:54 PM IST

‘రైటర్ పద్మభూషణ్’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘లహరి ఫిల్మ్స్’, ‘చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్’ సంస్థల నుండి వచ్చిన క్రేజీ మూవీ ‘మేము ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన సినిమా ఇది. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అనురాగ్ రెడ్డి(మేజర్ ఫేమ్), శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.

మే 26న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. టాక్ అయితే యావరేజ్ గా వచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ యూత్ ను, సోషల్ మీడియా బ్యాచ్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో సినిమా బాగానే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.01 cr
సీడెడ్ 0.28 cr
ఆంధ్ర 0.40 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 1.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.33 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.02 cr

‘మేమ్ ఫేమస్’ (Mem Famous) చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.2.02 కోట్ల షేర్ ను రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కి ఈ మూవీ రూ.22 లక్షల వరకు లాభాలను మిగిల్చింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus