Merlapaka Gandhi: మేర్లపాక గాంధీ కొత్త సినిమాలకు కథలు రెడీ!
June 1, 2021 / 03:14 PM IST
|Follow Us
ఇంట్రెస్టింగ్ అండ్ హుక్ పాయింట్ చుట్టూ కామెడీని రాసుకొని సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్నాడు మేర్లపాక గాంధీ. ఆయన సినిమాల్లో ఈ స్టైల్లో చేసిన రెండూ మంచి విజయం అందుకున్నాయి. అయితే అన్నీ ఇలాంటి సినిమాలే ఎందుకు అనుకున్నాడో ఏమో… ‘కృష్ణార్జున యుద్ధం’ చేసి బోల్తాపడ్డాడు. ఇప్పుడు నితిన్ ‘అంధాదున్’ రీమేక్ ‘మాస్ట్రో’ చేస్తున్నాడు. ఇటీవల ‘ఏక్ మినీ కథ’కి కథ అందించాడు. మరి తర్వాతేం చేయబోతున్నాడంటే… నవలలు కథలుగా తీసుకొని సినిమా చేస్తాడట.
ప్రముఖ రచయిత మేర్లపాక మురళీ తనయుడే మేర్లపాక గాంధీ అనే విషయం తెలిసిందే. మురళీ అద్భుతమైన నవలలు ఎన్నో రాశారు. అందులో చాలావాటిని మేర్లపాక గాంధీ చదివే ఉంటారు. ఆ మధ్య ఎప్పుడో నాన్నగారి రచనాలు నాపై బాగా ప్రభావం చూపిస్తాయి అని గాంధీ అన్నట్లు గుర్తు. మరి అతని నవలలను కథలు ఎంచుకొని, సినిమా తీసే ఉద్దేశం ఉందా? అని గాంధీని అడిగితే.. ‘యస్’ అనే సమాధానమే వచ్చింది. అంతేకాదు ఆ నవలలేంటో కూడా చెప్పారాయన.
ప్రస్తుతం టాలీవుడ్లో నవలల ట్రెండ్ తక్కువే అని చెప్పాలి. అయితే `కొండపొలెం` అనే నవల ఆధారంగా క్రిష్ – వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేశారు. ఇంకొన్ని ఆ దిశగా నడుస్తున్నాయి. ఇప్పుడు మురళి రాసిన వీరయ్య నవలను ఇటీవల గాంధీ చదివరాట. సినిమాకు ఆ కథ బాగా సెట్ అవుతుందని అనుకున్నారట. త్వరలో ఆ దిశగా పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు మరో నవల కూడా సినిమాగా మారే అవకాశం ఉందట. చూద్దాం నవలా కథకు హీరో ఎవరో?