Ghani Movie: ‘గని’ ఐటెమ్ సాంగ్ మరోసారి విని చూడండి
January 16, 2022 / 08:30 PM IST
|Follow Us
ఐటెమ్ సాంగ్ అంటే హీరోయిన్ అందాలు, కుదిరితే పొట్టి గౌన్లు, ఇంకొచెం స్కిన్ షోలు… ఇది ఒక రకం. ఇక్కడ ఇంకో రకం కూడా ఐటెమ్ సాంగ్స్ ఉన్నాయి. అందులో చిన్నపాటి బూతులు, అర్థం కాని బీట్లు, శబ్దాలు ఉంటాయి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో ఐటెమ్ సాంగ్స్ అంటే ఇలానే ఉంటున్నాయి. అవే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఐటెమ్ సాంగ్‌ని మోటివేషనల్ సాంగ్‌గా మార్చేశారు. ఏంటి డౌటా? అయితే ‘గని’ నుండి కొత్తగా వచ్చిన ‘కొడితే…’ పాటను విని చూడండి.
ఏంటీ వినొచ్చారా?…. ఎలా ఉంది పాట. తమన్నా హాట్ హాట్ అందాలు అదిరిపోయాయి కదా. ఇక తమన్ సంగీతం అయితే మరో లెవల్. పక్కా మాస్ మసాలా ఐటెమ్ సాంగ్లా ఉంది కదా. ఇప్పుడు మరోసారి వినండి… ఈసారి అందులోని లిరిక్‌ను ప్రత్యేకంగా విని చూడండి మీకే తేడా తెలుస్తుంది. ఎందుకు మేం పాటను మోటివేషనల్ సాంగ్ అని అన్నామో మీకే అర్థమవుతుంది. రామజోగయ్య శాస్త్రి కలం నుండి ఇటీవల జాలువారిన పాటల్లో ఇది కచ్చితంగా గొప్ప పాట అనే చెప్పొచ్చు. ఐటెమ్ సాంగ్‌లో అలాంటి పదాలు చొప్పించి రాయడం గొప్పే కదా.
అన్ని ఐటెమ్ సాంగ్స్ లాగే ఈ పాట కూడా ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. ‘లా లారే లాలే…’ అంటూ పక్కా బీట్ సాంగ్లా స్టార్ట్ అవుతుంది. కానీ అసలైన లిరిక్స్ వచ్చేసరికి మొత్తం మారిపోతుంది. బాక్సింగ్ నేపథ్య సాంగ్ కాబట్టి రామజోగయ్య శాస్త్రి రింగ్‌తోనే మొదులపెట్టారు. బాక్సింగ్ రింగ్‌ని డెస్టినీ రింగ్‌తో పోల్చారు. బాక్సింగ్ అతనికి స్ఫూర్తి అని కూడా చెప్పారు. పిడికిళ్లై పదివేళ్లు వంగనీ… వరదల్లే అడ్రినలిన్ పొంగనీ అంటూ హీరోకు స్ఫూర్తినిచ్చేలా పాటను రాసుకొచ్చారు రామ్‌జో.
ఐటెమ్ సాంగ్ అంటే ఫక్తు మాస్ మసాలా పదాలు ఉండాలSaiee Manjrekar,నే అలిఖిత నియమాన్ని పక్కన పెట్టి ఈ పాటను రాశారు ఆయన. బీట్తో వాటిని కలిపి చెప్పేసరికి ఐటెమ్ సాంగ్ లాగా కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఆ లెక్కన ఈ పాట ఐటెమ్ సాంగ్ కాదు… ఎప్పటి నుండో సినిమా నాయికలు చెప్పే ‘స్పెషల్ సాంగ్’. ఐటెమ్ సాంగ్ చేసి స్పెషల్ సాంగ్ అంటుంటారు కదా… ఇదీ ఆ సాంగ్ అనుకోవచ్చు.