Ranjit Jeyakodi: ‘మైఖేల్’ ఫ్లాప్ గురించి డైరెక్టర్ రంజిత్ రియాక్షన్ ఏంటంటే..?
February 7, 2023 / 10:36 AM IST
|Follow Us
హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్.. కొద్ది కాలంగా తన నుండి సరైన సినిమా రావట్లేదు.. దీంతో కొంత గ్యాప్ తీసుకుని.. కెరీర్లో ఫస్ట్ టైం ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా మూవీ చేశాడు. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్, దివ్యాంష కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప పి.శర్మ, అనసూయ, వరుణ్ సందేశ్ లాంటి హెవీ స్టార్ట్ కాస్టింగ్ తో..
నారాయణ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. రంజిత్ జయకోడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రోమోస్ మూవీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 3న మంచి అంచనాలతో రిలీజ్ అయింది ‘మైఖేల్’.. కట్ చేస్తే.. మేకర్స్ అనుకున్నంతగా సినిమా జనాలకు ఎక్కలేదు. మార్నింగ్ షో నుండే నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో కలెక్షన్స్ కూడా డల్ అయిపోయాయి. ‘‘అసలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే అంత స్టఫ్ ఏముంది కథలో..
కొత్త డైరెక్టర్, పెద్ద పెద్ద స్టార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లకెళ్తే సాలిడ్ షాక్ ఇచ్చాడు దర్శకుడు.. ‘మైఖేల్’ డిజాస్టర్’’ అని డిక్లైర్ చేసేశారు.. ఇక తమిళనాట పరిస్థితి సరేసరి.. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా పరువు తీసేశారంటూ కామెంట్స్ చేశారు. దీంతో తన చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, ఆకట్టుకోకపోవడం పట్ల డైరెక్టర్ రంజిత్ జయకోడి సామాజిక మాధ్యమం ద్వారా స్పందించాడు.
తర్వాత సినిమాకి మరింత కష్టపడి పని చేసి.. అందర్నీ అలరింపజేస్తానని చెప్పాడు. ‘‘మైఖేల్’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా.. వంద శాతం ఎఫెర్ట్ పెట్టి చేశాను.. ఇక్కడ ఏ సినిమా కూడా అందరినీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచదు, ప్రతి సినిమాకి లైక్స్, డిస్ లైక్స్ అనేవి కామన్.. నా తర్వాత మరింత హార్డ్ వర్క్ చేస్తాను.. తప్పకుండా మిమ్మల్నందర్నీ అలరించే సినిమా చేస్తాను’’ అని పేర్కొన్నాడు రంజిత్ జయకోడి చెప్పుకొచ్చాడు..