ఆ కారణంతోనే ఆ నటిని అరెస్ట్ చేయబోతున్నారు..!

  • September 21, 2019 / 03:51 PM IST

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది భాను ప్రియా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తూ కాలం గడుపుతుంది. ఇదిలా ఉండగా… తాజాగా ఈమె పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. గతంలో భానుప్రియ పై సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. తన ఇంటి పని కోసం మైనర్ అమ్మాయిలను నియమించుకోవడమే కాకుండా ఆ అమ్మాయిని వేధిస్తోందని కూడా భానుప్రియ పై ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

అయితే తన ఇంట్లో పని చేస్తూ ఆ అమ్మాయి దొంగతనానికి పాల్పడిందని… జనవరి 19న స్థానిక పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆ పని అమ్మాయి పై కేసు నమోదు చేయాలని భానుప్రియ ఫిర్యాదులో పేర్కొంది. అదే సమయంలో ఆ పని అమ్మాయి తల్లి ప్రభావతి సామర్లకోట పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడిపై కేసు పెట్టింది. ‘తన కూతురిని ఇంట్లో నిర్భంధించి చిత్ర హింసలు చేస్తున్నారని.. తన కూతురిని ఎలాగైనా రక్షించండి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సామర్లకోట పోలీసులు చెన్నైకి వెళ్లి భానుప్రియను విచారించగా… అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్‌ చేసి విచారించారు. ఇక తాజాగా సామర్లకోట పోలీసులు ఈ కేసుని… నేరం జరిగింది చెన్నైలో కాబట్టి నటి భానుప్రియ పై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు అప్పగించారు. దీంతో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు ఏక్షణంలో అయినా నటి భానుప్రియ,ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
బందోబస్త్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus