‘సర్కారు వారి పాట’ ని భయపెడుతున్న 11 నెగిటివ్ సెంటిమెంట్లు..!
May 11, 2022 / 10:28 PM IST
|Follow Us
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదల కాబోతుంది. ‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘జీఏంబీ ఎంటర్టైన్మెంట్’, ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాయి. టీజర్,పాటలు, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. సినిమా పై అంచనాల్ని కూడా పెంచాయి. దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అటు మహేష్ బాబు అభిమానులు ఇటు ప్రేక్షకులు ‘సర్కారు వారి పాట’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ‘సర్కారు వారి పాట’ అభిమానులను కొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు భయపెడుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) మహేష్ బాబుకి ‘మే’ నెల కలిసిరాదు. ‘నిజం’ నాని’ ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాలు ఇదే నెలలో రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యాయి. అయితే ‘మహర్షి’ చిత్రం సక్సెస్ అయ్యింది. కానీ మొదట ఈ మూవీకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ‘సర్కారు వారి పాట’ సంగతేంటో చూడాలి.
2) ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. ఓటిటిలో విడుదలైన ‘చిన్ని’ మూవీ తప్ప ఆమె నుండీ వచ్చిన మరే సినిమా కూడా ఆకట్టుకోలేదు. మరి ‘సర్కారు వారి పాట’ సంగతేంటో..!
3) మహేష్ బాబు గతంలో ‘అర్జున్'(యావరేజ్) అతడు(హిట్) పోకిరి(ఇండస్ట్రీ హిట్) అలా హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. అలాగే ‘దూకుడు’ ‘బిజినెస్ మెన్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలతో కూడా హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఇప్పుడు కూడా మహేష్ ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి ఫామ్లో ఉన్నాడు. మరి ‘సర్కారు వారి పాట’ సంగతేంటో..!
4) దర్శకుడు పరశురామ్ బుజ్జి… ఓ పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం ఇదే మొదటిసారి. మరి అతను స్టార్ హీరో అయిన మహేష్ ను ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడు అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.
5) ఈ చిత్రాన్ని ‘మైత్రి’ వాళ్ళతో పాటు ’14 రీల్స్ ప్లస్’ వారు కూడా కలిసి నిర్మించారు. వాళ్ళు నిర్మించిన సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు.
6) ఈ మధ్య కాలంలో నదియా నటించిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఈ మూవీలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది.
7) కీర్తి సురేష్- తమన్ కాంబినేషన్లో ‘మిస్ ఇండియా’ సినిమా వచ్చి ప్లాప్ అయ్యింది. ‘సర్కారు వారి పాట’ కి కూడా వాళ్ళ కాంబో యాడ్ అయ్యింది.
8) మహేష్ బాబు భీభత్సమైన ఎనర్జీతో నటించిన ‘ఖలేజా’ ‘ఆగడు’ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఈ మూవీలో అంతకు మించిన ఎనర్జీతో కనిపిస్తున్నాడు. ఆయన సెటిల్డ్ గా ఉండి, జీన్స్- షర్ట్ వేసుకుని మెసేజ్ లు ఇస్తేనే జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
9) మాటి మాటికీ ఈ చిత్రాన్ని ‘పోకిరి’ తో పోలుస్తున్నారు. ఓ ఇండస్ట్రీ హిట్ సినిమాతో పోల్చి హైప్ క్రియేట్ చేసి తీరా ఆ రేంజ్లో సినిమా లేదు అంటే మొదటికే మోసం వస్తుంది. ఈ మధ్య కాలంలో ‘పుష్ప’ ని 10 కె.జి.ఎఫ్ లు అంటూ పోల్చడం వల్ల భారీగా ట్రోలింగ్ జరిగింది.
10) గత కొన్ని రోజులుగా వర్షాలు తెగ కురుస్తున్నాయి.వాటిని లెక్క చేయకుండా జనాలు థియేటర్లకు వస్తారా అన్నది సందేహమే. ఈ చిత్రం ఓపెనింగ్స్ పై వాటి ప్రభావం పడే అవకాశం ఉంది.
11) ఈ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచేశారు. ఎక్కువ టికెట్ రేట్లు పెట్టుకుని జనాలు థియేటర్లకు వస్తారా? అన్నది మరో అంతు చిక్కని ప్రశ్న.
ఈ నెగిటివిటీని ‘సర్కారు వారి పాట’ జయిస్తుందా లేదా చతికిలపడుతుందా అన్నది మే 12న తేలిపోతుంది. చూద్దాం ఏమౌతుందో..!