Sagar: జనసేన పార్టీలో సాగర్ చేరడానికి అసలు కారణాలు ఇవేనా?

  • November 7, 2023 / 11:49 AM IST

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 స్థానాలలో జనసేన పోటీ చేస్తుండగా ఏపీలో ఈ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. త్వరలో జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందో ఏయే స్థానాలలో పోటీ చేస్తుందో క్లారిటీ రానుంది. మరోవైపు జనసేనలో చేరే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తాజాగా జనసేన పార్టీలో మొగలిరేకులు ఫేమ్ సాగర్ చేరారు. మొగలిరేకులు సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రలో నటించిన ఈ నటుడు ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు. పలు సినిమాలలో కూడా సాగర్ నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే జనసేనలో చేరిన సాగర్ ఈ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

జనసేన పార్టీ తరపున రామగుండం నుంచి (Sagar) సాగర్ పోటీ చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. జనసేన తరపున పోటీ చేస్తే సాగర్ కచ్చితంగా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. త్వరలో పవన్ పూర్తిస్థాయి రాజకీయాలలో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. పవన్ పోటీ చేసే నియోజకవర్గాల గురించి కూడా త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.

జనసేన పార్టీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవుతున్నారు. జనసేన పార్టీ నుంచి పవన్ రెండు స్థానాలలో పోటీ చేస్తారో లేక ఒక స్థానంలో పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ 120 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus