Mohan Babu: ఇండస్ట్రీ పిల్లలకు శుభవార్త చెప్పిన మోహన్ బాబు!
March 19, 2022 / 04:49 PM IST
|Follow Us
మంచు మోహన్ బాబు హీరోగా తెరకెక్కి గతనెలలో విడుదలైన సన్నాఫ్ ఇండియా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ సమయంలో మంచు మోహన్ బాబుపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్ విషయంలో మంచు ఫ్యామిలీ సైతం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంచు మోహన్ బాబు సినీ కార్మికుల పిల్లలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ఫీజులలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన పిల్లలకు రాయితీ ఇవ్వనున్నామని మోహన్ బాబు తెలిపారు.
సినీ కళామతల్లి 47 సంవత్సరాలుగా నన్ను నటుడిగా నిర్మాతగా ఆశీర్వదించి అక్కున చేర్చుకుందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కు 30 సంవత్సరాలుగా తాను అధినేతగా ఉన్నానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. 1992 సంవత్సరంలో ఈ విద్యాలయాలు ప్రారంభం అయ్యాయని అప్పటినుంచి కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలకు, ఇతర రాష్ట్రాల్లోని పిల్లలకు, ఇండస్ట్రీకి చెందిన కొందరి పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తున్నామని మోహన్ బాబు వెల్లడించారు.
శ్రీ విద్యానికేతన్ విద్యాలయాలు ప్రస్తుతం మోహన్‌బాబు విశ్వవిద్యాలయంగా మారాయని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తనకెంతో ఇచ్చిందని ఈ ఇండస్ట్రీ కోసం ఉడతాభక్తిగా చేయాలనే ఆలోచనతో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన వాళ్ల పిల్లలు మోహన్ బాబు యూనివర్సిటీలో చదవాలని అనుకుంటే రాయితీ ఇస్తామని మోహన్ బాబు తెలిపారు. ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని మోహన్ బాబు కోరారు.
మోహన్ బాబు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీ పిల్లలకు మోహన్ బాబు ఫీజులో రాయితీ కల్పించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోహన్ బాబు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది. మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్ కూడా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.