చిన్ననాటి సావిత్రిగా నటించనున్న మోహన్ బాబు మనమరాలు

  • August 8, 2017 / 01:55 PM IST

అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిన్నప్పటి సావిత్రిగా నటించే చిన్నారి కోసం డైరక్టర్ వెతుకుతున్నారు. ఆ రోల్ లో తన కూతురు విద్యా నిర్వాణను నటింపచేయించడానికి మంచు లక్ష్మి ప్రయత్నిస్తున్నారు. మూడేళ్లు కూడా నిండని ఈ చిన్నారి ఇప్పటికే పలు అవార్డు వేదికలపై సందడి చేసింది. కొంచెం కూడా బెదరకుండా వందల కెమెరాల ముందు నిలబడి ఫోజులిచ్చింది.

ఇక నటనను ఈ చిత్రంలో చూపించడానికి సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. విజయ్ దేవరకొండ మరో హీరో రోల్ చేస్తున్నారు.  మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ కెమెరామెన్ డాని పనిచేస్తుండడం విశేషం. అలనాడు ఓ వెలుగు వెలిగిన సావిత్రి జీవితంలోని కొత్త విషయాలను తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus