మోహన్ బాబుని మరిపించిన పాత్రలు

  • March 19, 2018 / 05:00 AM IST

మంచు భక్తవత్సలం నాయుడు.. మోహన్ బాబుగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి కలక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. తొలుత విలన్ పాత్రలతో మెప్పించిన ఈయన హీరోగా అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు. నిర్మాతగాను అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ఈరోజు (మార్చి 19 ) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు కి ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన పోషించి, గుర్తుండిపోయిన పాత్రలపై ఫోకస్…

కొదమ సింహంసుడిగాలి అని పేరు చెప్పగానే మోహన్ బాబు గుర్తుకు వస్తారు. చిరంజీవి హీరోగా నటించిన కొదమ సింహం సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ ఒప్పుకుని హీరోతో సమానంగా పేరు దక్కించుకున్నారు. ఈ మూవీలో డింగో డింగో అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ పేల్చి ఆకట్టుకున్నారు.

అసెంబ్లీ రౌడీ కలక్షన్ల వర్షం కురిపించిన సినిమా అసెంబ్లీ రౌడీ. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శివాజీగా మోహన్ బాబు అదరగొట్టారు. ఇందులో ఆయన డైలాగ్ చెబుతుంటే థియేటర్ చప్పట్లతో నిండి పోయింది. యాక్షన్ సీన్స్ లో కేక పుట్టించారు.

అల్లుడుగారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మెగా ఫోన్ నుంచి వచ్చిన ఆణిముత్యం అల్లుడుగారు. ఇందులో తాను ఇబ్బంది పడుతూ, ప్రేక్షకులను నవ్వించే అల్లుడు విష్ణు పాత్రలో మోహన్ బాబు జీవించారు. ఈ చిత్రంతో మహిళల్లో ఫాలోయింగ్ ని పెంచుకున్నారు.

పెదరాయుడు మోహన్ బాబు సినిమాల్లో 200 రోజులు ఆడిన సినిమాల్లో పెదరాయుడు ఒకటి. ఇందులో మోహన్ బాబు ద్వి పాత్రాభినయం చేశారు. పెదరాయుడు, రాజా రెండూ క్యారెక్టర్స్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.

రాయలసీమ రామన్న చౌదరి ఆవేశం మోహన్ బాబు నైజం. ఆ ఆవేశాన్ని వంద శాతం వెండి తెరపై ఆవిష్కరించిన సినిమా రాయలసీమ రామన్న చౌదరి. టైటిల్ రోల్లో మోహన్ బాబు జీవించేసారు.

యమదొంగ పౌరాణిక పాత్రల్లోనూ మోహన్ బాబు చక్కగా ఒదిగి పోగలరు. అందుకు నిదర్శనమే యమదొంగ సినిమాలో యముడు పాత్ర. దర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అద్భుతంగా నటించి అభినందనలు అందుకున్నారు.

వీడెవడండీ బాబు పూర్తి స్థాయి సీరియస్ పాత్రలే కాదు.. ఆది నుంచి అంతం వరకు నవ్వుకునే కథల్లోనూ మోహన్ బాబు అలరించారు. వీడెవడండీ బాబు సినిమాలో శ్రీరామ్ గా నవ్వులు పంచారు.

బుజ్జిగాడు పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు గుర్తిండి పోయే పాత్ర చేశారు. శివన్న గా డిఫరెంట్ గా నటించి శెభాష్ అనిపించుకున్నారు.

రౌడీ రౌడీ అనే పదాలతో ఎక్కువగా సినిమాలు తీసి విజయాన్ని సొంతం చేసుకున్న హీరో మోహన్ బాబు ఒక్కరే. అదే టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు సినిమా చేశారు. ఇందులో అన్నగా డైలాగ్ కింగ్ పలికించిన హావభావాలు సీనియారిటీకి నిదర్శనం.

అన్నమయ్య భక్తిరస చిత్రమైన అన్నమయ్యలో సాళువ నరసింహ రాయలుగా మోహన్ బాబు నటించి సినిమా విజయానికి దోహదం చేశారు. హీరోగా చిత్రాలు చేస్తున్న సమయంలో నటనకు ప్రాధాన్యం ఉంటే ఇటువంటి క్యారెక్టర్స్ ఒప్పుకొని తన ప్రతిభను ప్రదర్శించుకొని, అభినందనలు అందుకోవడం ఆయనకి అలవాటు…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus