అది కొంచెం కష్టమైన పనే అంటున్న మోహన్ లాల్

  • March 16, 2021 / 07:43 PM IST

దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు విజయాలను సొంతం చేసుకున్నారు మోహన్ లాల్. జార్జికుట్టి పాత్రలో అద్భుతంగా నటించిన మోహన్ లాల్ ఆ పాత్ర గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలు తెరపై కనిపించకుండా నటించడం కష్టమని మోహన్ లాల్ పేర్కొన్నారు. దృశ్యం 2 సినిమాలోని పాత్రలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించకుండా నటించడం తేలిక కాదని మోహన్ లాల్ తెలిపారు. భావోద్వేగాలు కనిపించకుండా నటించడం ఎంతో కష్టమైన పని అని మోహన్ లాల్ అన్నారు. నటన అనేది నమ్మకమని..

కొన్ని సందర్భాల్లో నిజమైన భావోద్వేగాలను లోలోపల పలికించాల్సి ఉంటుందని మోహన్ లాల్ పేర్కొన్నారు. నిజమైన భావోద్వేగాలను లోలోపల పలికించడం తేలిక కాదని.. కొన్ని రకాల ఎమోషన్లను చూపించాల్సి ఉంటుందని మోహన్ లాల్ వెల్లడించారు. మోహన్ లాల్ జార్జి కుట్టి పాత్రలో అద్భుతంగా నటించగా తెలుగులో దృశ్యం 2 రీమేక్ లో వెంకటేష్ నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన దృశ్యం 2 పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు హిట్టైన సంగతి తెలిసిందే. 2013 సంవత్సరంలో దృశ్యం సినిమా విడుదలై హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు భారీగా కలెక్షన్లను తెచ్చిపెట్టింది.

దృశ్యం సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా తెరకెక్కింది. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న దృశ్యం 3 కూడా భవిష్యత్తులో తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళంలో హిట్ అయిన దృశ్యం ఇతర భాషల్లో రీమేక్ కావడంతో పాటు అదే ఫలితాన్ని అందుకుంటూ ఉండటం గమనార్హం. జీతూ జోసెఫ్ నిజ జీవితంలో చూసిన ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా కథను తెరకెక్కించినట్టు సమాచారం.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus