Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి నాని డైరెక్టర్.. పక్కా బ్లాక్ బస్టర్ అంటూ?

  • August 7, 2023 / 11:56 PM IST

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా బాలయ్య చెప్పిన విషయాలు మినహా మిగతా విషయాలు నిజమో కాదో అభిమానులకు అర్థం కావడం లేదు. మోక్షజ్ఞ లుక్స్ కూడా మారిన నేపథ్యంలో ఫస్ట్ మూవీ షూటింగ్ వేగంగా మొదలైతే బాగుంటుంది. ఈ ఏడాదే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య స్వీయ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి.

ఆదిత్య369 సినిమాకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చారని ఈ సినిమా కోసం కొంతమంది యంగ్ డైరెక్టర్ల సహాయసహకారాలు తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ల జాబితాలో దసరా మూవీతో నానికి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల పేరు వినిపిస్తుండటం గమనార్హం. శ్రీకాంత్ ఓదెల టేకింగ్ అద్భుతంగా ఉంటుందని గతంలోనే ప్రచారం జరిగింది.

కొన్ని వారాల క్రితం పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ ఓదెల (Mokshagna) మోక్షజ్ఞ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారని త్వరలో ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వైరల్ అవుతున్న వార్తల విషయంలో నిజానిజాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు. శ్రీకాంత్ ఓదెల రెమ్యునరేషన్ సైతం భారీగా పెరిగిందని తెలుస్తోంది. తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకుంటే శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరినట్టేనని చెప్పవచ్చు.

శ్రీకాంత్ ఓదెల కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా కథ, కథనాలను సిద్ధం చేసుకుంటే మాత్రం శ్రీకాంత్ ఓదెల కెరీర్ కు తిరుగుండదని చెప్పవచ్చు. శ్రీకాంత్ ఓదెల మోక్షజ్ఞ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్ జనరేషన్ డైరెక్టర్ల డైరెక్షన్ లో మోక్షజ్ఞ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus