వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల కు హీరోయిన్ గా పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ తన మొదటి చిత్రం తప్ప తర్వాత ఏ సినిమా కూడా హిట్ కొట్టకపోవడంతో ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. స్టార్ హీరోలతో భారీ అంచనాలతో విడుదలైన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ భామ ఈ చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ని సాధించింది.
గత కొంతకాలంగా డబ్బుల కోసం ఎ హీరోతోనైన నటిస్తుందని, నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని రకుల్ పై విమర్శలు ఉన్నాయి.వాటి పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్ ‘నేను సినిమా పరిశ్రమకి పెద్ద నటిని అని నిరూపించుకోవడానికి రాలేదని,నా కంటే మంచి నటులు పరిశ్రమ లో ఉన్నారని,తన పాత్ర ఉన్నంతసేపు అందంగా ఉండాలని, ఆ పాత్రని చెడగొట్టాననే పేరు నాకు రాకపోతే చాలని చెప్పుకొచ్చింది.తనకి క్రేజ్ ఉన్నన్ని రోజులు వరుస సినిమాలు చేసి డబ్బు సంపాదించుకొని సెటిల్ అవుతానని., తనకి పెద్దగా డ్రీమ్ రోల్స్ లో నటించాలనే ఆశ ఏమిలేదని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.