తెరపైకి ‘కే‌సి‌ఆర్’ జీవిత చరిత్ర..?

  • April 30, 2016 / 02:38 PM IST

తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించి, 29 వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జీవిత చరిత్ర.. త్వరలోనే తెరకెక్కనుందనే వార్తలు వినవస్తున్నాయి.

ఈ విషయం పై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(జూన్ 2) రోజున ప్రకటన వెలువదనుందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులు మొదలు పెట్టగా.. కే‌సి‌ఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, మిలియన్ మార్చ్ వంటి అంశాలను ఈ చిత్ర కథాంశంలో చేర్చానున్నారని ఫిల్మ్ నగర్ టాక్. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని,  ఓ ప్రముఖ దర్శకుడికి ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు అప్పజెప్పినట్లు భోగట్టా. అయితే కే‌సి‌ఆర్ పాత్రను ఎవరు పోషిస్తారు..? ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అసలు ఈ చిత్రం ఉందా లేదా ? అన్న విషయాల పై స్పష్టత రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus