Tollywood: ఏప్రిల్ లో రిలీజ్ చేస్తే నష్టాలు తప్పవా?
February 11, 2022 / 04:18 PM IST
|Follow Us
సాధారణంగా ఇతర సీజన్లతో పోలిస్తే సమ్మర్ లో సినిమాలను రిలీజ్ చేయడం వల్ల పెద్ద సినిమాలు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ తొలి వారం సమయానికి ఇంటర్, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేవి. అందువల్ల సమ్మర్ లో విడుదలయ్యే సినిమాలను చూడటానికి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపేవారు. అయితే కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది పరీక్షలు ఆలస్యంగా జరగనున్నాయి.
ఏప్రిల్ రెండో వారం నుంచి మే నెల రెండో వారం వరకు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ మార్చి నెలలో రిలీజ్ కానుండగా ఆ సినిమాలకు వచ్చే టాక్ ను బట్టి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ సినిమాలను చూసే విషయంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీని మిస్ చేసుకుంటే ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కానుంది.
ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త టికెట్ రేట్లు అమలులోకి వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తుండగా భీమ్లా నాయక్ ఏప్రిల్ లో రిలీజైతే విద్యార్థుల ప్రభావం కలెక్షన్ల విషయంలో కొంతమేర పడే ఛాన్స్ అయితే ఉంది. అదే నెలలో రిలీజ్ కానున్న కేజీఎఫ్2, బీస్ట్, ఆచార్య, ఎఫ్3 సినిమాలపై కూడా పరీక్షల ప్రభావం పడే ఛాన్స్ ఉంది. సర్కారు వారి పాట రిలీజ్ సమయానికి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
ఏప్రిల్ లో పెద్ద సినిమాలను రిలీజ్ చేసే నిర్మాతలు ఆ సమయంలో పరిస్థితులకు అనుగుణంగా సినిమా రిలీజ్ డేట్ల విషయంలో మార్పులు చేసే ఛాన్స్ అయితే ఉంది. కరోనా థర్డ్ వేవ్ వల్ల ఈ ఏడాది మే వరకు పెద్ద సినిమాల విడుదలకు అనుకూల పరిస్థితులు లేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కచ్చితంగా పరీక్షలను నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.