బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా దసరాకు రిలీజ్ కాదని ఇప్పటికే తేలిపోయింది. సంక్రాంతికి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో మరో తెలుగు సినిమా సంక్రాంతికి ఫిక్స్ కాదని అందరూ భావించారు. పోటీ ఎక్కువగా ఉండటంతో రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించడం లేదు. అయితే సంక్రాంతి రేసులో బాలయ్య నటిస్తున్న అఖండ సినిమా కూడా ఉండవచ్చని తెలుస్తోంది.
ఈ నెల చివరినాటికి అఖండ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో పలువురు మెగా హీరోలతో బాలకృష్ణ పోటీ పడగా వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ మధ్య పోటీ తప్పదని తెలుస్తోంది. అయితే అఖండ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సంక్రాంతికి విడుదలై సక్సెస్ సాధించాయి. ఆ రీజన్ వల్లే బాలయ్య సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
సంక్రాంతికి అఖండ విడుదలైతే థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అఖండ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలో ఈ సినిమా నుంచి మరో సింగిల్ కూడా రిలీజ్ కానుందని సమాచారం. బాలయ్య ఫ్యాన్స్ అఖండ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!