అమాయకత్వం కలిగిన అమ్మాయిలుగా మెప్పించిన హీరోయిన్లు
January 29, 2018 / 09:46 AM IST
|Follow Us
అందం, అమాయకత్వం కలిస్తే.. అదే తెలుగు అమ్మాయిలు. అలాంటి అమాయకత్వం నిండిన పాత్రలు నేటి తెలుగు సినిమాల్లో కనిపించడం అరుదైపోతున్నాయి. కొంతమంది డైరక్టర్స్ మాత్రమే ఇటువంటి రోల్స్ తమ సినిమాల్లో చూపిస్తున్నారు. ఆ అమాయకత్వం కలిగిన అమ్మాయిల రోల్స్ లో మన హీరోయిన్లు మెప్పిస్తున్నారు. ఆ పాత్రలు.. ఆ హీరోయిన్స్ పై ఫోకస్..
గీత (ఆర్య )ఒక అబ్బాయి చనిపోతాను అని బెదిరించినందుకే అతన్ని ప్రేమించడానికి ఒప్పుకుంటుంది ఆర్య సినిమాలో గీత పాత్ర. ఈ పాత్రలో అనురాధ మెహతా చక్కగా నటించింది. ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఉన్నారా? అనే ప్రశ్న కలిగేలా చేసింది.
భూమి (బృందావనం ) ఎన్టీఆర్ బృందావనం సినిమాలో భూమి పాత్ర.. పేరుకు తగ్గట్టు ఎంతో సహనంతో పాటు.. అమాయకంగా ఉంటుంది. ఈ పాత్రలో కాజల్ అగర్వాల్ ఒదిగిపోయింది.
వసుమతి (తీన్మార్) పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో వసుమతి పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. తండ్రితో మాట్లాడటానికి భయం.. అబ్బాయి నచ్చినా చెప్పడానికి సిగ్గు.. గుండెలో బాధనంత కళ్ళలో దాచుకునే తత్వం కలిస్తే వసుమతి. ఈ రోల్ కి కృతి కర్బందా బాగా సూట్ అయింది.
జాను (తమ్ముడు) కొంతమంది అమ్మాయిలు తమ నచ్చిన అబ్బాయికోసం ఏమైనా త్యాగం చేస్తారు. వారు ఎంత బాధపెట్టినా క్షమించేస్తారు. అటువంటి అమ్మాయి పాత్ర జాను. తమ్ముడు సినిమాలో ఈ రోల్ ని ప్రీతి ఎంతో ప్రియంగా చేసింది.
మహాలక్ష్మి (సరైనోడు) ఇంట్లో గారాబంగా పెరిగితే గర్వంగా అయినా.. అమాయకత్వంతోనైనా ఉంటారు. రెండో కేటగిరీలోకి వస్తుంది సరైనోడు చిత్రంలోని మహాలక్ష్మి రోల్. ఈ పాత్రకి ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన నటనతో మరింత అమాయకత్వాన్ని నింపింది.
సరయు (బద్రి) బద్రి సినిమాలో రేణు దేశాయ్ రోల్ కంటే అమీషా పటేల్ పోషించిన సరయు రోల్ నే ఎక్కువమంది ఇష్టపడుతారు. కారణం అమాయకత్వమే.
ఇలా అమాయకత్వంతో ఆకట్టుకున్న రోల్స్ రీసెంట్ సినిమాలో మీకేమైనా గుర్తుంటే కామెంట్ చేయండి.