‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!
October 31, 2022 / 08:00 AM IST
|Follow Us
ఈ 2022 టాలీవుడ్ కు ఓ కొత్త పాఠం నేర్పింది అనే చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన సినిమాల సంఖ్యని గమనిస్తే… అందులో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలు కాదు కాదు డిజాస్టర్ అయిన సినిమాల సంఖ్యే ఎక్కువ అని చెప్పాలి. 2021 లో ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలు కూడా కొన్ని హిట్ అయ్యాయి. కానీ ఈ ఏడాది హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన జనం.. పెరిగిన ధరలకు భయపడి పోయి సినిమాల కోసం థియేటర్ కు వెళ్లే పని పెట్టుకోవడం లేదు. అవసరమైతే భాష రాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ ఓటీటీల్లో కొత్త సినిమాలు/సిరీస్ లు చూడాలని ఫిక్స్ అయ్యారు.
ఇక రిలీజ్ అయిన 4 వారాలకే సినిమా ఎలాగూ ఓటీటీకి వచ్చేస్తుంది అని తెలిసి ‘మాకు టాక్ మాత్రమే కాదు సినిమాలో కూడా సంథింగ్ స్పెషల్ ఉండాలి అని ఫిక్స్ అయ్యాడు’. అందుకే ఈ ఏడాది నెలకు 10 పేరున్న సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక్కటి హిట్ అవ్వడం కూడా గగనం అయిపోయింది. ఇక టాక్ నెగిటివ్ గా వస్తే ఫస్ట్ షోలకే జనాలు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి.ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఆర్.ఆర్.ఆర్ :
రాజమౌళి- ఎన్టీఆర్ – రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1135 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
2) సర్కారు వారి పాట :
మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.178 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
3) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.161 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
4) రాధే శ్యామ్ :
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.151 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
5) కె.జి.ఎఫ్ 2 :
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
6) ఎఫ్3 :
వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.129 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
7) కార్తికేయ 2 :
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
8) గాడ్ ఫాదర్ :
చిరంజీవి – సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి మోహన్ రాజా దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.106 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
9) సీతా రామం :
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.91 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
10) ఆచార్య :
చిరంజీవి- రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి కొరటాల శివ దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.74 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.